చంద్రబాబుతో పవన్‌ భేటీ..

98
- Advertisement -

టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు జనసేనాని పవన్ కల్యాణ్. హైదరాబాద్ చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో జనసేనతో టీడీపీ పొత్తు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇక ఏపీలో రోడ్డు షోలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం జీవో 1ను అమల్లోకి తెచ్చింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అధికారులు అనుమతిచ్చిన చోటనే సభలు నిర్వహించుకోవాలని ఈ జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం తీరుసుకున్న నిర్ణయాన్ని ఏపీలోని ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు, పవన్ భేటీ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -