జనసేన నుండి వినుత బహిష్కరణ

8
- Advertisement -

శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి వినుత కోటను బహిష్కరించింది ఆపార్టీ. శ్రీకాళహస్తి నియోజక వర్గం ఇంచార్జీగా ఉన్న శ్రీమతి వినుతి కోట వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకి భిన్నంగా ఉన్నందున గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచడమైంది అని ప్రకటన విడుదల చేశారు.

ఆమెపై చెన్నైలో హత్య కేసు నమోదు అయిన విషయం పార్టీ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో శ్రీమతి వినుత కోటను పార్టీ నుంచిబహిష్కరించడమైందని ఆ పార్టీ నేత అజయ్ కుమార్ తెలిపారు.

డ్రైవ‌ర్‌ను హ‌త్య చేశారు జ‌నసేన ఇన్‌చార్జ్ దంప‌తులు. ఈ కేసులో శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జ్ కోటా వినూత, భర్త చంద్రబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. గోడౌన్‌లో డ్రైవ‌ర్ రాయుడును చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి హ‌త్య చేసి న‌దిలో ప‌డేశారు దండుగులు. చెన్నైలోని కూవం నదిలో మృతదేహం లభ్యం కాగా హత్య కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు.

Also Read:Peddi:శివన్న ఫస్ట్ లుక్

- Advertisement -