వరద సమయంలో జగన్ బురద రాజకీయాలు..

13
- Advertisement -

వరదల సమయంలోబురద రాజకీయాలు చేయడం మాజీ సీఎం జగన్ కి చెందిందన్నారు రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ . విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో వరద సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు రామకృష్ణ.

జనసేన పార్టీ తరఫున ఈ సింగినగర్ ప్రాంతంలో తనను నియమించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరద సమయంలో కూడా వరద రాజకీయాలు చేయడం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిందని విమర్శించారు. ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పిన ఇంకా సిగ్గు రాలేదన్నారు. చంద్రబాబు స్వయంగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న విమర్శలు చేయడం తగదన్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సమీక్ష సమావేశాలతో పార్టీ ప్రజాప్రతినిధులను అధికారులను సమన్వయం చేస్తూ ముందుకు వెళుతున్నారని పేర్కొన్నారు.

Also Read:తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా ఇకలేరు..

- Advertisement -