జానీ మాస్ట‌ర్‌కు జనసేనకు షాక్‌..

3
- Advertisement -

లైంగిక వేధింపుల వివాదంలో చిక్కుకున్న ప్ర‌ముఖ‌ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్‌కు జ‌న‌సేన పార్టీ షాకిచ్చింది. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండాల‌ని ఆదేశించింది. ఆయ‌న పై రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు అయిన క్ర‌మంలో పార్టీ నాయ‌క‌త్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలిపింది. త‌క్ష‌ణ‌మే ఈ నిర్ణ‌యం అమ‌లులోకి వ‌చ్చిన‌ట్లుగా పేర్కొంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్ట‌ర్ పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేసింది. 2017లో డీషోలో జానీ మాస్టర్ తో త‌న‌కు ప‌రిచ‌మైంద‌ని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. అనంత‌రం జానీ మాస్టర్ టీమ్ నుండి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండాలంటూ ఫోన్ రావడంతో 2019లో అసిస్టెంట్ కొరియోగ్రాఫ‌ర్‌గా జాయిన్ అయిన‌ట్లు వెల్ల‌డించింది. ఓ షో కోసం జానీ మాస్ట‌ర్‌తో పాటు మ‌రో ఇద్ద‌రితో క‌లిసి ముంబైకి వెళ్ల‌గా అక్క‌డ ఓ హోట‌ల్‌లో త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాని అని తెలిపింది. దీంతో జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.

 

Also Read:కౌశిక్ రెడ్డి..బ్లాక్ బుక్!

- Advertisement -