సీట్లు తేల్చే పనిలో పవన్?

34
- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో పక్క వ్యూహరచనతో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే సీట్ల కేటాయింపుపై పవన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీతో పొత్తు కోసం పవన్ ఆరాటపడుతుండడంతో ఇన్నాళ్ళు సీట్ల కేటాయింపుపై కొంత మౌనం వహించారు పవన్. అయితే పొత్తు సంగతి అటుంచి.. ముందు జనసేన బలంగా ఉండే నియోజిక వర్గాలలో అభ్యర్థులను ప్రకటించి ఆ తరువాత మిగిలిన సీట్లను పొత్తులో భాగంగా కేటాయింపు జరిపే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా తెనాలి నియోజిక వర్గంలో బరిలో నిలిచే అభ్యర్థిని ప్రకటించారు పవన్. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీలో ఉండబోతున్నట్లు పవన్ స్పష్టం చేశారు. ఆయన గెలుపు కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు పవన్. ఇక అలాగే ఉత్తరాంధ్రలోని మరికొన్ని నియోజిక వర్గాల నుంచి కూడా అభ్యర్థులను దాదాపు కన్ఫర్మ్ చేశారట. వారిని కూడా త్వరలోనే ప్రకటించబోతున్నట్లు టాక్. అయితే తాను పోటీ చేసే స్థానంపై మాత్రం పవన్ ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓటమి చవిచూసిన జనసేనాని, ఈసారి కచ్చితంగా గెలిచే నియోజిక వర్గం నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారట. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం. మళ్ళీ భీమవరం నుంచే పవన్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయట. అయితే గత ఎన్నికల్లో మాదిరి రెండు చోట్ల పవన్ పోటీ చేస్తారా లేదా ఒక నియోజిక వర్గాన్నే ఎంచుకుంటారా అనేది ఆసక్తికరం.

Also Read:జూపల్లికి నిరాశ తప్పదా?

- Advertisement -