జనసేనతో బీజేపీ కటిఫ్..చెప్పినట్లేనా?

40
- Advertisement -

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ బీజేపీ వైఖరి ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఓ వైపు ఎన్నికలు ముంచుకొస్తున్న కమలనాథులు మాత్రం ఏం పట్టానట్టుగా వ్యవహరిస్తున్నారు. అసలు ఏపీలో పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్ కూడా మెయిన్ లైన్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తుంటే బీజేపీ మాత్రం సైలెంట్ గా ఉండడం కొత్త చర్చలకు తావిస్తోంది. గత కొన్నాళ్లుగా బీజేపీ జనసేనతో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే జనసేన పార్టీ టీడీపీతో కూడా పొత్తులో ఉంది. ఇదే ఇప్పుడు బీజేపీ డైలమాలో పడేసిన అంశం. ఎందుకంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని రాష్ట్ర కమలనాథులు చాలా సార్లు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు సీట్ల విషయంలో గాని, ఎన్నికల్లో పోటీ అంశంపై గాని ఇరు పార్టీల మద్య ఎలాంటి చర్చలు జరగలేదు. .

దానికి తోడు పవన్ టీడీపీకే అధిక ప్రాధాన్యత ఇస్తూ బీజేపీని అసలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే టీడీపీ జనసేన మద్య సీట్ల పంపకాల అంశం కూడా తుది దశకు చేరుకుంది. రేపో మాపో టీడీపీ జనసేన సీట్ల ప్రకటన కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పవన్ బీజేపీకి కంప్లీట్ గా దూరమైనట్లేనా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఒకవేళ బీజేపీతో పొత్తులో ఉంటే పవన్ ఆ పార్టీ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారనేది ఇటు ప్రజల్లోనూ, అటు కమలనాథుల్లోనూ తొలుస్తున్న ప్రశ్న. అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం జనసేన పార్టీని ఎన్డీయేలో భాగం చేసినప్పటికీ రాష్ట్ర బీజేపీకి మాత్రం పవన్ దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారట.

పలుమార్లు టీడీపీతో కలిసి నడవాలని పవన్ బీజేపీ పెద్దలకు సూచించినప్పటికి పార్టీ అధిష్టానం నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో పవన్ బీజేపీకి దూరంగా ఉంటూ టీడీపీకి పూర్తగా దగ్గరైనట్లు వినికిడి. ఈ నేపథ్యంలో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతుందా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పొత్తుల గురించి ఇటీవల మాట్లాడుతూ తుది నిర్ణయం అధిష్టానానిదే అని చెప్పడంతో అసలు బీజేపీ ఏం ఆలోచిస్తుందనే చర్చ జరుగుతోంది. మరి ప్రస్తుతం ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్న కాషాయపార్టీ ముందు రోజుల్లో ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందో చూడాలి.

Also Read:KCR:ఆట ఆరంభం..కే‌సి‌ఆర్ ఎంట్రీ!

- Advertisement -