తెలంగాణ కాంగ్రెస్ నేత జానారెడ్డి మనసు మార్చుకున్నారా..? ఇన్ని రోజులు పోటీకి విముఖంగా ఉన్న జానారెడ్డి సడన్‌గా ఇప్పుడు మళ్లీ పోటీ చేస్తానని ఎందుకు ప్రకటించారు?, కాంగ్రెస్ పెద్దల నుండి ఏదైనా కీలక హామీ లభించిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వాస్తవానికి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు జానారెడ్డి. నాగార్జున సాగర్ లేదా మిర్యాలగూడ నుండి ఆయన తనయుడిని రంగంలోకి దించుతారనే వార్తలు వస్తున్నాయి.
ఇక సాగర్ ఉప ఎన్నికల తర్వాత పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జానా సేవలను ఉపయోగించుకోవాలని భావించిన కాంగ్రెస్ అధిష్టానం అసంతప్తులను బుజ్జగించే పనిని ఆయనకు అప్పజెప్పారు. నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేయగా దానికి జానారెడ్డి కన్వీనర్‌గా ఉన్నారు.
ఇక రీసెంట్‌గా ఢిల్లీ వెళ్లి వచ్చిన జానారెడ్డి..సాగర్ నుండి తననే పోటీ చేయమని అధిష్టానం పెద్దలు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దీంతో జానా పోటీకి సుముఖంగా ఉండటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందాన్ని నింపుతుండగా ఆయనకు పెద్ద పదవి పైనే హామీ వచ్చిందని ప్రచారం జరుగుతోంది.
Also Read:జయం రవి…’గాడ్’ సెన్సార్ పూర్తి