రేవంత్‌రెడ్డి వర్గంపై జానా ఫైర్..!

357
revanth
- Advertisement -

జాతీయ కాంగ్రెస్ నుంచి లోకల్ కాంగ్రెస్ వరకు గ్రూపు రాజకీయాలు అన్నవి వెరీ కామన్..ఇక తెలంగాణ కాంగ్రెస్‌ సంగతి సరేసరి. ఇక్కడ ఎవరికి వారు తోపులే..పార్టీలో మేమే నెంబర్‎‌వన్ అని ఫీల్ అయితరు. కాంగ్రెస్ పార్టీకిప్రత్యర్థులు అంటూ ఎవరూ ఉండరు..ఆ పార్టీలో నాయకులే వారికి ప్రత్యర్థులు..అసలు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ పదవికి రాజీనామా చేయడం ఏమో కాని… కాంగ్రెస్ పార్టీ చావుకు వచ్చిందంటే నమ్మండి..పీసీసీ కుర్చీ నాక్కావాలంటే నాకు కావాలని ఢిల్లీకి పోయి అధిష్టానాన్ని బతిమాలుకున్నరు. ఎవరికి వారు మేమే తోపులమని చెప్పుకున్నరు..ఇందులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిలు పీసీసీ కుర్చీ కోసం కాస్త గట్టిగానే ప్రయత్నం చేసిన్రు.. ఇంతలో పెద్దాయన జానారెడ్డి సాగర్ ఉప ఎన్నికలయ్యేదాకా పీసీసీ కుర్చీ లొల్లి ఆపితే బెటర్ అని అధిష్టానంకు చెబితే..వాకే…పెద్దలు జానారెడ్డిని గెలిపించండి..ఆ తర్వాత పీసీసీ కుర్చీ గురించి ఆలోచిద్దాం అంటూ ఢిల్లీ పెద్దలు హుకుం జారీ చేశారు.

చేతిదాకా వచ్చిన కుర్చీ చేజారిపోవడంతో రేవంత్‌రెడ్డి పరేషాన్ అయిండు.. ఈ కాంగ్రెస్ సీనియర్లకు నా సత్తా ఏంటో చూపించాలని చడీచప్పుడు కాకుండా పాదయాత్ర చేసి జనాల్లోకి నాకు ఎంత క్రేజ్ ఉందో చూడండి అంటూ అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేసిండు..దీంతో కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఎవరికి వాళ్లు కుతకుతలాడిపోతున్నరు. థాట్..అధిష్టానం అనుమతి లేకుండా వేరే వాళ్ల నియోజకవర్గాల్లో రేవంత్ పాదయాత్ర ఎలా చేస్తడంటూ గుస్సా అయిన్రు..మరోవైపు కాంగ్రెస్‌లో సీనియర్ల పని అయిపోయిందని, రేవంతే పీసీసీ ప్రెసిడెంట్ అని ఆయన అనుచరులు, అభిమానులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్రు..కాంగ్రెస్ సీనియర్ నేతలను బఫూన్లుగా చిత్రీకరిస్తూ..రేవంత్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన్రంట..అంతే పెద్దాయన జానారెడ్డికి కోపం వచ్చింది..వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి కాంగ్రెస్ సీనియర్ నేతలందరికీ, ఇన్‌డైరెక్ట్‌గా రేవంత్ అభిమానులకు క్లాస్ తీసుకున్నరు.. అసలే రోజు రోజుకీ పార్టీ సంకనాకిపోతుంటే మధ్యలో మీ పీసీసీ కుర్చీ లొల్లి ఏందని చిరాకుపడ్డడు..ఇగో ఇక నుంచి కుర్చీ కోసం కొట్టుకోవడం మానేసి కలిసి పని చేయండి అని సుద్దులు చెప్పిన్రు..మీకు, మీకు పంచాయతీ ఉంటే పెద్ద మనుషులం మేమున్నం..పార్టీ ఫోరమ్ ఉంది…ఆడికి వచ్చి మాట్లాడుకోండి…అంతే కాని ఇట్ల గ్రూపు రాజకీయాలు చేసుడు బండ్‌ చేయండ్రి, పార్టీని ఏం చేద్దామనుకున్నరు.. అని పెద్దాయన కాంగ్రెస్ లీడర్లను పొట్టు పొట్టు తిట్టిండు.

ఇక సోషల్ మీడియాలో మా సీనియర్ నేతలను టార్గెట్ చేసి పోస్టులు పెట్టుడు ఏందీ..అసలు పీసీసీ కుర్చీ కోసం కొట్టుకోవడం ఏందీ..అది అధిష్టానం డిసైడ్ చేస్తది…ఏం సీనియర్ నేతలను పార్టీ నుంచి బయటకు పంపిద్దామనుకున్నరా.. పీసీసీ కుర్చీ రాకుంటే పార్టీనే లేకుండా చేస్తరా.. మా సీనియర్ లీడర్లపై పోస్టులు పెట్టుడు బంద్ చేయండి…లేకుంటే హైకమాండ్‌‌కు ఫిర్యాదు చేస్తా అని జానాసారు గరంగరం అయిండు.. ఇలాంటి చిల్లర పనులు చేస్తే పార్టీలో సీనియర్ల నుంచి చిన్న నాయకుల వరకు అందరిపై కూడా చర్యలు తీసుకోవాలని పెద్దాయన డిమాండ్ చేశారు. కార్యకర్తలు అభిమానించే నాయకుడు కూడా తన వెంట ఉన్నవారిని కట్టడి చేయాలి…లేకుంటే ఆ నాయకుడికి, ఆయన వెంట ఉన్న వారికి కూడా నష్టం తప్పదన్నారు జానా సార్ వార్నింగ్ ఇచ్చారు. మొత్తంగా కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలున్నాయని జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రచ్చ రచ్చ అవుతోంది. సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో రేవంత్ అభిమానులకే జానారెడ్డి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

- Advertisement -