గాలి వారి పెళ్లి ఖర్చు తెలుసా…?

253
Janardhana Reddy daughter's wedding budget
- Advertisement -

గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి పెళ్లి వైభవం దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. కుమార్తె పెళ్లికి 5 వందల కోట్లు ఖర్చుపెట్టుబోతున్నాడట గాలి. ఆహ్వాన పత్రికతోనే సంచలనాలు సృష్టించిన ఈ వివాహ వైభవం, ఇప్పుడు భోజనాల విషయంలోనూ ఔరా అనిపిస్తోంది. అన్ని అనకున్నట్లు జరిగితే.. హైదారాబాద్‌కు చెందిన ఓ బడా వ్యాపారవేత్త కుమారుడురాజీవ్‌రెడ్డితో, గాలి కుమార్తె బ్రహ్మిణి వివాహం నవంబర్ 16న జరగనుంది. ఇందుకు భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే వెయ్యి, ఐదవందల నోట్ల రద్దుతో ఒక్కసారి ఈ పెళ్లికి బ్రేకులు పడ్డాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

maxresdefault

ఇదిలా ఉంటే తాజాగా నెట్టింట్లో గాలి జనానార్ధన్ రెడ్డి కూతురు ఫోటోస్ హల్ చేస్తున్నాయి. ఒంటిపై కాస్త గ్యాప్ కూడా లేకుండా బంగారం ధరించిన ఉన్న ఈ ఫోటోలు చూసి అందరు ముక్కున వేళేసుకుంటున్నారు. గాలి ఇంటి పెళ్లి వైభవం మామూలుగా లేదు మరీ. ఈ ఫోటోల్లో గాలి గారి గారాలపట్టీని చూస్తుంటే బంగారు బొమ్మనేమో అనిపిస్తోంది. తలకి, మెడకి, చేతులకి, కాళ్లకి ఎక్కడ చూసినా బంగారమే బంగారం. ఇంతలా ఖర్చు చేస్తున్న ఈ వివాహవైభవం చూస్తున్న వాళ్లకి ఇప్పటికే వామ్మో అనిపిస్తోంది. ఇప్పుడే ఈ రేంజ్ లో ఇక పెళ్ళిలో ఆభరణాలు ఏ స్థాయిలో వుంటాయో ఊహించుకోవచ్చు.

Wedding-580x395

బెంగళూరు ప్యాలేస్ లో జరిగే ఈ వేడుకకు అందరు వీవీఐపీలే తరలిరానున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. పసందైన విందు భోజనాలతో వేడుకకు హాజరైన ప్రతీ ఒక్కరు ఆహా అనడం ఖాయమంటున్నారు. ప్రపంచంలో ఫేమస్ వంటకాలన్నీ మెనూలో ఉండేలా గాలి.. నిర్వాహకులకు ఆర్డర్ వేశాడట. సుమారు వెయ్యికి పైగా వంటకాలు సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. పెళ్లిలో ఒక్క భోజనాలకే 100 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారట. మొత్తం పెళ్లి ఖర్చు4 నుంచి 5 వందల కోట్ల వరకు అయ్యే ఛాన్స్ ఉందని ఇప్పటికే అంచనా కూడా వేసిందట గాలి ఫ్యామిలీ. ఇంత పెద్ద ఎత్తున శుభకార్యానికి ఏర్పాట్లు జరుగుతున్నా.. గాలి సన్నిహితులు మాత్రం ఇది ఓ మధ్యతరగతి పెళ్లిగానే చెప్పుకోవడం విశేషం. ఔను! గాలి జనార్ధన్ రెడ్డి లాంటి అపరకుబేరులకు ఇది మధ్యతరగతి పెళ్లి లాంటిదే. గాలి రేంజ్ అలాంటి మరీ.

gaali

- Advertisement -