జానా రెడ్డి ఓటమి….

296
jana reddy
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ మంత్రి జానారెడ్డి ఓటమిపాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య…జానాపై గెలుపొందారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఓటమిబాటలోనే ఉన్నారు. రేవంత్,గీతారెడ్డి,డీకే అరుణ,పొన్నం,పొన్నాల వెనుకంజలోనే ఉన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి,సర్వే సత్యానారయణ ఓటమిపాలయ్యారు.

పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ ఓటమి పాలయ్యారు. తెరాస అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజాకూటమి ప్రభావం కనిపించలేదు. తెలంగాణ జన సమితి,సీపీఐ కనీసం బోణి కొట్టలేదు. ఇక సీపీఎం నేతృత్వంలోని బీఎల్‌ఎఫ్‌ ఉసే కనిపించలేదు. ఫలితాల్లో ఎక్కడా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

ఇప్పటివరకు గెలిచిన వారిలో టీఆర్ఎస్ నుండి ఆరూరి రమేష్,సంజయ్ కుమార్,విద్యాసాగర్,నోముల ఉన్నారు.

- Advertisement -