జమునగా తమన్నా.. నిజమేనా ?

88
- Advertisement -

చిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టించిన నటీమణులందరి బయోపిక్​లు తీయడం ఇప్పుడు ట్రెండ్​గా మారింది. సీనియర్ నటి జమున శుక్రవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ మూవీలో తమన్నా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక జమున గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

జమున ఆస్తుల విలువెంతో తెలుసా..? తన కెరీర్ మొదట్లో జమున గారు రూ.1000 పారితోషకం తీసుకున్నారు. అనంతరం తనకంటూ ప్రత్యేక ఇమేజ్ వచ్చాక, ఆమె తన రెమ్యునరేషన్ పెంచుకుంటూ వెళ్ళారు. ఈ క్రమంలోనే ఆమెకు అవకాశాలు బాగా పెరగడంతో అప్పట్లోనే రూ.2 లక్షల పారితోషకం కూడా జమున గారు తీసుకున్నారు. ప్రస్తుతం జమున గారి ఆస్థి విలువ 40-50కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

ఐతే, జమున గారి కెరీర్ లో కష్టాలు కూడా ఉన్నాయి. ఓ దశలో జమున వ్యవహార శైలి నచ్చలేదని ఆ సమయంలో ఏఎన్నార్, ఎన్టీఆర్ ఇద్దరూ ఆమెతో గొడవ పడి నటించబోమని చెప్పారు. షూటింగ్ కు ఆమె లేటుగా వస్తోందని, కాలు మీద కాలువేసుకొని కూర్చుంటోందని, పెద్దలని గౌరవించడం లేదని ఆరోపణలు చేశారు. దాంతో నాలుగైదేళ్లు ఆమెకు ఛాన్స్ లు తగ్గాయి. కానీ ఆ తర్వాత ఆమె మళ్లీ నిలబడ్డారు.

ఇవి కూడా చదవండి…

విషమంగానే తారకరత్న ఆరోగ్యం..

ఆర్ఆర్ఆర్…జపాన్‌లో 100రోజులు

‘పఠాన్’ కలెక్షన్ల బీభత్సం

- Advertisement -