నేరేడు పండు తింటే ప్రమాదమా?

46
- Advertisement -

సాధారణంగా నేరేడుపండ్లు వర్షాకాల ఆరంభ సీజన్ లో లభిస్తుంటాయి. రుచిలో కాస్త వగరు, పులుపు, తీపి మిళితమై ఉండే ఈ పండును చాలమంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ పండు షుగర్ వ్యాధిగ్రస్తులకు అద్బుత లాంటిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే ఈ పండుకు రక్తంలో చక్కెర శాతాన్ని కంట్రోల్ చేసే గుణాలు మెండుగా ఉంటాయి. అంతే కాకుండా ఈ తినడం వల్ల ఇంకా చాలా రకాల ప్రయోజనాలే ఉన్నాయి. నేరేడు పండు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపుల ఉంటుంది. ఇంకా వివిధ రకాల జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా నేరేడు పండు చెక్ పెడుతుంది. కాలేయ పనితీరును మెరుగుపరచడంలో ఈ పండు ఎంతో ప్రయోజనకారి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా కిడ్నీల పనితీరును మెరుగుపరిచి మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. .

ఇంకా ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె, మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. అయితే నేరేడు పండు తినడం వల్ల లాభాలతో పాటు కొంతమందిలో నష్టాలను కూడా తెస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండడం మంచిదట ఎందుకంటే ఈ పండులో ఉండే కొన్ని రకాల సమ్మేళనాలు ఎసిడిటీకి కరణమౌతాయట. ఇంకా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు కూడా నేరెండు పండుకు దూరంగా ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకా నే రెండు పండ్లు అధికంగా తింటే శరీరంలో వాతం పెరుగుతుంది. ఇంకా జ్వరం, గొంతు నొప్పి వంటి సమస్యలు కూడా ఏర్పడవచ్చని చెబుతున్నారు నిపుణులు. మరి ముఖ్యంగా ఖాళీ కడుపుతో నేరేడు పండు తింటే కడుపులో మంట, ఉబ్బరం వంటి సమస్యలకు దారి తీస్తుందట. కాబట్టి నేరేడు పండ్లను వీలైనంత మితంగానే తినాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read:జగన్ వర్సెస్ షర్మిల.. పులివెందుల ఫైట్?

- Advertisement -