కొత్తగా ఏర్పడిన కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్ము కశ్మీర్, లడఖ్ లతో పాటు మరో రెండు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. జమ్మూకశ్మీర్‌కు మొదటి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఐఏఎస్ అధికారి గిరీష్ చంద్ర ముర్మును నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను గోవా గవర్నర్‌గా బదిలీ చేశారు.
కొత్తగా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడ్డ లడఖ్‌కు కృష్ణ మాథూర్‌ను లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు. ఇక మిజోరం కొత్త గవర్నర్‌గా పీఎస్ శ్రీధరన్ పిల్లైని నియమించారు. 1985 బ్యాచ్ గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన గిరీష్ ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఎక్స్‌పెండిచర్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గిరీష్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గానూ విధులు నిర్వర్తించారు.