అష్టలక్ష్మి దేవాలయంలో జమ్మి చెట్టు

4
- Advertisement -

పుట్టినరోజు సందర్బంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కార్యక్రమం లో భాగంగా ఈ రోజు అష్ట లక్ష్మి అమ్మవారి దేవాలయ పరిదిలో జమ్మి చెట్టును నాటారు BRS నాయకులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోర్డినేటర్ గర్రెపల్లి సతీష్.

గర్రెపల్లి సతీష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు, హిందూ సంస్కృతి సంప్రదాయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జమ్మి చెట్టును ప్రతి గుడి ఆవరణలో నాటాలని కోరారు. గౌరవ తెలంగాణ తొలి ముఖ్య మంత్రి KCR గారు అమ్మవారి ఆశీస్సులతో పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎప్పుడు అండగా ఉండే విదంగా శక్తిని ఇవ్వాలని ఆ అమ్మవారిని కోరడం జరిగింది. అదే విధంగా ప్రకృతి ప్రేమికులు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి అష్టలక్ష్మి అమ్మవారి వారి ఆశీస్సులతో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చెయ్యాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమం లో ప్రధాన అర్చకులు రాఘవ చార్యులు, ఆలయ సిబ్బంది పూర్ణ చందర్,BRSV రాష్ట్ర కార్యదర్శి NN రాజు, రాహుల్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:జమ్మూలో కాంగ్రెస్‌ కూటమి..హర్యానాలో బీజేపీ

- Advertisement -