కీసర గుట్ట దేవాలయంలో జమ్మి చెట్టు

8
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం లో భాగంగా ఇవాళ కీసర గుట్ట దేవాలయ పరిదిలో జమ్మి చెట్టును నాటారు మాజీ కీసర గుట్ట సర్పంచ్ మాధురి.

కీసర మాజీ సర్పంచ్ మాధురి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు, హిందూ సంస్కృతి సంప్రదాయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జమ్మి చెట్టును ప్రతి గుడి ఆవరణలో నాటాలని కోరారు. గత సంవత్సరం నాటిన జమ్మి చెట్టు ఎంత అద్భుతంగా పెరిగిందో చూపిస్తూ ఆనంద పడ్డారు.ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు కీసర గుట్ట రామ లింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చెయ్యాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఈవో సుధాకర్ రెడ్డి , చైర్మన్ నాగ లింగం శర్మ,మాజీ mptc నారాయణ శర్మ మరియు వేద పండితులు హాజరయ్యారు.

Also Read:9న ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేత

- Advertisement -