సర్కారు బడికి ఎన్ఆర్ఐ బాలుడి చేయూత

242
Jalagam vedansh for Govt school
- Advertisement -

ప్రవాస తెలంగాణ బాలుడు సర్కారు బడికి పోతానని స్వరాష్ర్టానికి వచ్చాడు. ఆరు సంవత్సరాల జలగం వేదాన్ష్ అమెరికాను వదిలి స్వస్థలమైన వెంకట్రామపురం(అనంతగిరి మండలం)లో ప్రభుత్వ పాఠశాలకు పోతుండు. అమెరికా సియటెల్ నగరంలోని నివసిస్తున్న వేదాన్ష్ తండ్రి జలగం సుధీర్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. అక్కడి పాఠశాలల్లో కుల వ్యవస్థకు ప్రాధాన్యమిస్తున్న ఎన్‌ఐఆర్‌లను చూసి విసుగు చెందిన సుధీర్ తన కుమారుడిని తెలంగాణకు తీసుకొచ్చి ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాడు.

ఈ క్రమంలో తన ఉద్యోగానికి కూడా సుధీర్ రాజీనామా చేశాడు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కుమారుడికి పరిచయం చేసి, సర్కార్ బడికి పంపే ప్రయత్నం చేశాడు. మొదట కొద్దిగా ఇబ్బంది పడిన వేదాన్ష్ ప్రభుత్వ పాఠశాలలో చదవడానికి ఇష్టపడ్డాడు. చదువంతా సర్కార్ బడిలోనే పూర్తి చేస్తానని బాలుడు చెబుతున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు కూడా సుధీర్ కృషి చేస్తున్నాడు

బడిలోని అపరిశుబ్రత, రిపేర్లు, బాత్ రూం లపై తన అభిప్రాయాన్ని ఫొటోతో  సహా రాసి ఉప ముఖ్యమంత్రి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు జలగం సుధీర్‌. ప్రజావాణి లో సైతం ఈ సమస్యపై ఫిర్యాదు కూడ చేశారు. వేదాన్ష్ తాతయ్య జలగం రంగారావు తన మనమడు వేదాన్ష్ చేసిన ఫిర్యాదు కు స్పందించి సుమారు లక్ష రూపాయిల ఖర్చుతో పెయింటింగ్, శుభ్రత, 2 టీవీలతో డిజిటల్ తరగతులు, టి విత్ హెడ్మాస్టర్, లైబ్రరికి పుస్తకాలు లాంటి పనులు చేసి ప్రభుత్వ పాఠశాల అభివ్రుద్ది చేయటం జరిగింది. ఈ పనులకు ప్రభుత్వ పాఠశాల అభివృద్దిలో హెడ్మాస్టర్ రంగారావు, ఇతర ఉపాద్యాయులు, ఎం.ఈ.వో. శ్రినివాస రావు, డి.ఈ.ఓ వెంకట నర్సమ్మ , జిల్లా కలెక్టర్ సురెంద్ర మోహన్, సర్పంచ్ వేదాంత్ రావు పూర్తిగా సహాయం అందించారు.

అమెరికా లోని అన్ని సౌకర్యాలతో ఉన్న బడులలో చదువుకొనే వేదాన్ష్ తెలంగాణ లోని  ఒక ప్రభుత్వ పాఠశాల లో కొంతకాలం  చదివి నిర్భయంగా తన అభిప్రాయాన్ని తెలంగాణ మంత్రి శ్రీహరి దృష్టి కి తీసుకు వచ్చి ఆ స్కూల్‌ అభివృద్దికి తన తాతయ్య జలగం రంగా రావు ద్వారా మరియు ప్రభుత్వ పెద్దల చొరవ తో ప్రత్యక్షంగా, పరోక్షంగా  తోడ్పాడునందించినందుకు  అమెరికా తెలంగాణ అసొసియేషన్ ప్రత్యేక అభినందనలు తెలిపింది.

సియటెల్ నగరం లో తమ బోర్డ్ మీటింగ్ లో వేదాన్ష్ ను అభినందించిన కార్యక్రమం లో అమెరికా తెలంగాణ అసొసియేషన్ అద్యక్షుడు కొండా రాం మోహన్, ముఖ్యులు రఘువీర్ రెడ్డి, వినోద్ కుకునూర్, వెంకట్ మంతెన, దయ బూరంశెట్టి, మహెందర్ రామసహయం, సత్య కందిమల్ల, రవి ఉపాద్, స్రిధర్ బాణాల, రాజ్ రెడ్డి మరియు  ఇతర ప్రముఖులు ఉన్నారు.

- Advertisement -