జాజికాయ పొడితో ఆరోగ్యం!

52
- Advertisement -

ఆయుర్వేదంలో జాజికాయకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో రోగాలకు జాజికాయను ఔషధంలా ఉపయోగిస్తారు. ముఖ్యంగా పురుషులు ఎదుర్కొనే అన్నీ రకాల శృంగార సమస్యలకు జాజికాయతో చక్కటి పరిష్కారం దొరుకుతుందట. జాజికాయను మెత్తగా పొడిలా చేసుకొని పాలలో కలుపుకుని తాగడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఇంకా వీర్య వృద్దిని ప్రోత్సహిస్తుంది. అలాగే అంగస్తంభన, శీఘ్రస్కలనం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అంతే కాకుండా ఉదర సంబంధిత సమస్యలను కూడా జాజికాయ దూరం చేస్తుంది. దీని పొడిని సూప్ లో కలుపుకొని తాగడం వల్ల విరేచనాల సమస్య తగ్గుతుంది. ఇంకా మలబద్దకం, గ్యాస్ తదితర జీర్ణ సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. ఇంకా జాజికాయను రోజు ఉపయోగించడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందట.

ఇంకా గుండె సమస్యలు కూడా దూరమౌతాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇంకా జాజికాయ పొడిని కొద్దిగా నీళ్ళలో కలుపుకొని జిగట గా ఉన్నప్పుడు ముఖానికి రాసుకుంటే మొటిమలు, నల్లటి మచ్చలు తగ్గుతాయి. ఇంకా ముఖం కాంతివంతంగా మారడానికి దోహద పడుతుంది. ఇంకా జాజికాయలో ఉండే ఔషధ గుణాలు దగ్గు, జలుబు, కఫం, వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇంకా మూత్రపిండాలలో రాళ్ళను కరిగించడంలో కూడా జాజికాయ సమర్థవంతంగా పని చేస్తుంది. అయితే జాజికాయ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నప్పటికి తగిన మోతాదులోనే తీసుకోవాలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే జాజికాయ పొడిని ఎక్కువగా సేవించడం వల్ల ఏకాగ్రత కోల్పోవడం, మైకం కమ్మడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జాజికాయకు దూరంగా ఉండాలి. లేదంటే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది.

Also Read:చంద్రబాబుకు ఎన్‌ఎస్‌జీ భద్రత తొలిగింపు

- Advertisement -