టీమిండియా ఫ్యూచర్ జైస్వాల్ యేనా?

42
- Advertisement -

టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ పై నెట్టింట ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగి భారీ స్కోర్ కు బాటలు వేశాడు. టెస్టుల్లో టీమిండియా తరుపున చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. కేవలం టెస్టుల్లోనే కాకుండా టీ20 లలో కూడా జైస్వాల్ అదరగొడుతున్నాడు. చిన్న వయసులోనే ఎలాంటి వత్తిడిలో లోనవకుండా బౌలర్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ మ్యాచ్ కి తగినట్లుగా తన బ్యాటింగ్ సరళిని మార్చుకుంటూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా భవిష్యత్ ఆశాకిరణం అంటూ జైస్వాల్ పై ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే అనవసరంగా జైస్వాల్ ను హీరో చేయొద్దని మాజీ ఆటగాడు గంభీర్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం జైస్వాల్ తన పరిధిలో బాగా ఆడుతున్నాడని, అతడిని హీరో చేయడం వల్ల ఒత్తిడి పెరిగి తన సహజసిద్ద ఆటను కోల్పోయే అవకాశం ఉందని గంభీర్ వ్యాఖ్యానించాడు. జైస్వాల్ కు పూర్తి స్వేచ్చనివ్వాలని ముందు రోజుల్లో అతడు మరిన్ని సంచలనాలు నమోదు చేసే అవకాశం ఉందని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక రానున్న టీ20 వరల్డ్ కప్ లో యశస్వి జైస్వాల్ టీమిండియా తరుపున కీలక ఆటగాడిగా నిలిచే అవకాశం ఉందని కొందరు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఓపెనర్ గా బరిలోకి దిగేటప్పటికి ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా అలవోకగా షాట్స్ ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు జైస్వాల్. మరి ముందు రోజుల్లో జైస్వాల్ ఎలాంటి ప్రదర్శనతో రాణిస్తాడో చూడాలి.

Also Read:ఖర్జూరాలు తింటే ఎన్ని ఉపయోగాలో!

- Advertisement -