టూరిజాన్ని దెబ్బతీయడమే వారి టార్గెట్!

5
- Advertisement -

కశ్మీర్‌ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైన పర్యాటక రంగాన్ని దెబ్బతీసే లక్ష్యంతోనే పహాల్గం దాడి జరిగింది అన్నారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్.డెన్మా‍ర్క్‌, నెదర్లాండ్స్‌ పర్యటనలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జై శంకర్.. కశ్మీర్‌లో పర్యాటకాన్ని దెబ్బతీసే, మతపరమైన విభేదాలను రెచ్చగొట్టే లక్ష్యంతో జరిగిన అనాగరిక చర్యగా అభివర్ణించారు.

పాకిస్థాన్‌, ఆ దేశ ఆర్మీ చీఫ్‌ మునీర్‌ తీవ్రమైన మతపరమైన దృక్పథంతో నడిచే వ్యక్తి అని విమర్శించారు. లష్కరే ఉగ్రవాదులు మతం నిర్ధరించుకున్న తర్వాత కుటుంబ సభ్యుల ముందే 26 మందిని దారుణంగా హత్య చేశారు. మతపరమైన విభేదాలు సృష్టించడానికి మతం అనే అంశాన్ని ఉద్దేశపూర్వకంగా ముందుకుతెచ్చారు అన్నారు.

ఇక ఇటీవలె పాక్ ఆర్మీ చీఫ్‌ మునీర్‌కు పాక్ అత్యున్నత మిలటరీ ర్యాంకు ఇచ్చిన సంగతి తెలిసిందే. 1959లో జనరల్‌ ఆయుబ్‌ ఖాన్‌కు ఫీల్డ్‌ మార్షల్‌ హోదా కట్టబెట్టారు. 2022 నవంబర్‌లో ఆర్మీ చీఫ్‌గా మునీర్‌ బాధ్యతలు చేపట్టారు.

Also Read:ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

- Advertisement -