- Advertisement -
హిమాచల్ ప్రదేశ్ 14వ ముఖ్యమంత్రిగా జైరాం ఠాకూర్(52) బుధవారం (డిసెంబర్ 27) ప్రమాణ స్వీకారం చేశారు. సిమ్లాలోని రిడ్జ్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. కేంద్రమంత్రలు, బీజేపీ పాలిత రాఫ్ట్రాల సీఎంలు సిమ్లాలో సందడి చేయగా.. ప్రమాణ స్వీకారం వేడుకతో రిడ్జ్ మైదానం మొత్తం కషాయం జెండాలతో నిండిపోయింది.
హిమాచల్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 44 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో హిమాచల్ ప్రదేశ్‌లో గెలుపు అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థిపై తర్జనభర్జనలు జరిపిన బీజేపీ ఆదివారం జైరాం ఠాకూర్ పేరును ఖరారు చేసింది. ఠాకూర్ మండీ జిల్లాలోని సెరాజ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా..ఠాకూర్‌తో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
- Advertisement -