బర్త్ డే కానుకగా ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ అందించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ హిట్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న చిత్రం జై లవకుశ. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్నారు.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రేపు 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో… ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక రోజు ముందుగానే అంటే… ‘జై లవ కుశ’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసి మంచి ట్రీట్ ఇచ్చింది. రాక్ స్టార్ డీఎస్పీ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఎన్టీఆర్ సరసన నివేదా థామస్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రానికి ఇంటర్నేషనల్ మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ హార్ట్‌వెల్ పనిచేస్తున్నారు. ఈయన గతంలో లార్డ్స్ ఆఫ్ ది రింగ్స్, షటర్ ఐలాండ్ చిత్రాలకు పనిచేశారు. ఈ చిత్రంలో విలన్ ఛాయలున్న పాత్రను వాన్స్ ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పాత్రకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయిన సంగతి తెలిసిందే.