ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో వచ్చిన “జై లవకుశ” మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.మరి అక్కడక్కడా కొంచెం మిక్సిడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ లో ఏ మాత్రం అలసటని చూపెట్టడం లేదు. భారీ అంచనాలతో తెరకెక్కిన “జై లవకుశ” సినిమా ఎన్టీఆర్ కెరీర్‌కి మంచి బూస్ట్ ని ఇస్తోందనే చెప్పాలి.
గురువారం రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజుతో కలుపుకుని 80 కోట్లవరకూ వసూలు చేసిందని ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను శని,ఆదివారాల్లో మరింతగా వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ వీకెండ్ ముగిసే నాటికి ఓవర్సీస్ లో ఈ సినిమా 2 మిలియన్ మార్క్ ను చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా రాబట్టే వసూళ్లను చూసుకుంటే, ఈ వీకెండ్ లో 100 కోట్ల మార్క్‌ను అధిగమించవచ్చని అంటున్నారు. అదే జరిగితే ఎన్టీఆర్ కెరియర్లో అత్యంత వేగంగా 100 కోట్లను కొల్లగొట్టిన చిత్రంగా ‘జై లవ కుశ’ నిలుస్తుందని చెబుతున్నారు. ‘నాన్నకు ప్రేమతో’ .. ‘ జనతా గ్యారేజ్’ .. ‘ జై లవ కుశ’ ఇలా ఒక దానిని మించి మరొకటి హిట్ కొట్టడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.