లవకుశకు కోటిమంది ‘జై’ కొట్టారు!

201
Jai Lava Kusa Teaser creates record
Jai Lava Kusa Teaser creates record
- Advertisement -

జైలవకుశ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.ఇందులో ఎన్టీఆర్ మెస్మ‌రైజింగ్ లుక్ తో క‌నిపించి ఫ్యాన్స్ ఆనందాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళాడు. సినీ సెలెబ్రిటీలు, అభిమానులే కాదు.. ఇతర హీరోల అభిమానులు సైతం టీజర్ చాలా చాలా బాగుందని పొగుడుతున్నారు. టీజర్‌ విడుదలైన 48 గంటల్లోనే కోటీ వ్యూస్‌ సాధించి సృష్టించి అరుదైన ఘనత సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ వెల్లడించింది. ఇంతటి సంచలన స్పందన అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొంది.

jailavakusa1b

అభినవ రావణుడిగా జై పాత్రలో తారక్ ఒదిగిపోయిన తీరు, డైలాగ్ చెప్పే విధానం, ఆహార్యంపై నలుమూలల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరి, టీజర్‌పై వెల్లువెత్తుతున్న ప్రశంసల నేపథ్యంలో తారక్ స్పందించారు. తన ట్విట్టర్ వేదికగా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘అభిమానులు, స్నేహితులు, సినీ ప్రముఖులు, మీడియా నుంచి వెల్లువెత్తుతున్న ప్రేమ, వారి అభినందనలు, ఫీడ్‌బ్యాక్‌తో చాలా ఆనందమేస్తోంది. ఇంకా..ఇంకా మెరుగయ్యేందుకు కృషి చేస్తాను. లవ్ యూ ఆల్’’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్నఈ చిత్రంలో ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండగా సినిమా సెప్టెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి టీజర్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్ మ‌రి కొద్ది రోజుల‌లో మ‌రో రెండు పాత్ర‌ల‌కి సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు టాక్. భారీ సెట్ లో జై ల‌వ‌కుశ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఇందులో రాశి ఖ‌న్నా, నివేదా థామ‌స్, సీకె ముర‌ళీధ‌ర‌న్ , బాలీవుడ్ యాక్ట‌ర్ రోనిత్ రాయ్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -