రావణుడొచ్చేశాడు… జై లవకుశ టీజర్

356
Jai Lava Kusa Teaser
- Advertisement -

జూనియ‌ర్ ఎన్టీఆర్, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం జై ల‌వకుశ‌.  ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండగా సినిమా సెప్టెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర టీజర్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

ఇందులో ఎన్టీఆర్ మెస్మ‌రైజింగ్ లుక్ తో క‌నిపించి ఫ్యాన్స్ ఆనందాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళాడు. షార్ట్ అండ్ స్వీట్ గా ఉన్న ఈ టీజ‌ర్ స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేయ‌నుంద‌ని ఫ్యాన్స్ జోస్యాలు చెబుతున్నారు. మ‌రి కొద్ది రోజుల‌లో మ‌రో రెండు పాత్ర‌ల‌కి సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు టాక్.  భారీ సెట్ లో జై ల‌వ‌కుశ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఇందులో రాశి ఖ‌న్నా, నివేదా థామ‌స్, సీకె ముర‌ళీధ‌ర‌న్ , బాలీవుడ్ యాక్ట‌ర్ రోనిత్ రాయ్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -