హీరోగా ముందు నిరూపించుకో: ఎన్టీఆర్

213
Jai Lava Kusa Movie Release Date
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జై లవకుశ. బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఎన్టీఆర్ న్యూ లుక్ అందరికి షాక్ ఇచ్చింది. మొదటి సారి ఎన్టీఆర్ కొత్త గెటప్‌లో, అదికూడా నెగిటివ్‌గా కనిపించడం, చేతులకు సంకెళ్లు వేసిన లుక్ చూస్తుంటే ఇందులో ఉన్న మూడు పాత్రల్లో ఒకటైన నెగిటివ్ పాత్ర అని తెలిసిపోతుంది. ఈ చిత్రంలో మొదటి సారి ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తున్నాడని తెలిసిన విషయమే.

Jai Lava Kusa Movie Release Date

జై, లవుడు, కుశల్ గా రెండు పాజిటివ్, ఒక నెగిటివ్ పాత్ర ఉంటుందని టాక్. మొత్తానికి ఈ ఫస్ట్ లుక్‌తో సినిమాపై అంచనాలు మాత్రం భారీగా పెరిగాయి. ఈ సినిమాతో ఖచ్చితంగా వందకోట్ల మార్కెట్‌ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు యంగ్‌ టైగర్‌. ఇప్పటికే బిజినెస్ పరంగా భారీ ఆఫర్స్ వస్తున్నట్టు సమాచారం. ఇక జై లవకుశ సినిమా దసరా కానుకగా విడుదల చేసే సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఎన్టీఆర్‌ తన అన్న కల్యాణ్‌ రామ్‌కు ఓ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Jai Lava Kusa Movie Release Date

అయితే ఎన్టీఆర్‌ కల్యాణ్ రామ్‌కు ఈ సినిమాను టేబుల్ ప్రాఫిట్ తోనే అమ్మేయమని సూచించాడట. అంతే కాకుండా ఏదో ఒక ప్రాజెక్టు చేయాలనే ఉద్దేశ్యంతో సినిమాలు చేసి చేతులు కాల్చుకోవద్దని, పవర్‌ పుల్‌ సబ్జెక్ట్‌, క్రేజీ కాంబినేషన్‌ కుదిరితేనే తప్ప సినిమాలు నిర్మించొద్దని గట్టిగానే హెచ్చరించాడట ఎన్టీఆర్‌. సినిమాలు నిర్మాణాల కన్నా సాధ్యమైనంత వరకు హీరోగానే ముందు కెళ్లమని, హీరోగా తనేంటో ముందు నిరూపించుకోవాలని కల్యాణ్‌ రామ్‌కు ఎన్టీఆర్‌ సూచించినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ సూచించిన‌ట్టు క‌ల్యాణ్ రామ్ సినిమా నిర్మాణాల‌పైనే దృష్టి పెడ‌తాడో లేక హీరోగా సినిమాలు చేయ‌డానికి సిద్ధ‌ప‌డ‌తాడో చూడాలి.

- Advertisement -