యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాబీ దర్శకత్వంలో ‘జై లవ కుశ’ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూణేలో జరుగుతోంది. గతంలో ‘రామ్ లీలా’ షూటింగ్ జరుపుకున్న భవనంలోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
ఇదిలా ఉంటే…ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే ‘జై’ క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని, టీజర్ ని విడుదల చేసారు. ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో రెండో టీజర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ రెండో టీజర్ ‘లవ’ క్యారెక్టర్ కి సంబంధించిదని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ టీజర్ ఎలా ఉండాలనే దానిపై ఎన్టీఆర్, బాబి, కళ్యాణ్ రామ్ మధ్య చర్చలు జరిగాయని సమాచారం.
ఈ నేపథ్యంలో ఆడియో వేడుకకి ముహూర్తం ఖరారు చేశారు. వచ్చేనెల 12వ తేదీన హైదరాబాద్ లో ఘనంగా ఈ వేడుకను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాశిఖన్నా, నివేదా థామస్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.సెప్టెంబర్ 21న ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.