జై లవకుశలో మరో లీక్‌ …?

338
Jai Lava Kusa: Jr NTR's introductory song 'Ravana' leaked online
- Advertisement -

ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ కెరీర్ లోనే తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తుండడంతో ఈచిత్రానికి ఎనలేని క్రేజ్ వచ్చింది.

దీనికి తగ్గట్లుగా జై క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ వదిలిన టీజర్ అదరగొట్టేసింది. దీనితో బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి.

  Jai Lava Kusa: Jr NTR's introductory song 'Ravana' leaked online

అయితే.. జై లవకుశ టీజర్ లోని కొన్ని సన్నివేశాలు కొద్ది రోజుల క్రితం ఆన్ లైన్ లో లీకైన సంగతి తెలిసిందే. అదే తరహాలో తాజాగా జైలవకుశ సినిమాలోని ఇంట్రడక్షన్ సాంగ్ లీకైనట్లు తెలుస్తోంది. ఆ సాంగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నట్లు కొన్ని ఇంగ్లిష్ వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా ఈ ఘటనపై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు.

గతంలో టీజర్ సన్నివేశాల లీక్ కు కారణమైన గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జై లవకుశ సినిమాలోని ఇంట్రడక్షన్ సాంగ్ లీకైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆన్ లైన్ లో ఆ వీడియో వైరల్ అవుతున్నట్లు తెలుస్తోంది.

జై లవకుశ టీజర్ కు విపరీతమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ టీజర్ కు 24 గంటల్లోనే 7.5 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. 3 విభిన్న పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎలా నటించనున్నాడన్న ఆసక్తి తెలుగు సినీ ప్రేక్షకులలో నెలకొంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న ‘జై లవ కుశ’లో జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా రాశీ ఖన్నా నివేదా థామస్ నటిస్తున్నారు. దీనికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తుండగా ఈ సినిమా సెప్టెంబరు 21న విడుదల కానుంది.

- Advertisement -