‘జై లవకుశ’ మరో రికార్డ్‌..

220
- Advertisement -

ఎన్టీఆర్ ‘జై లవ కుశ’దసరా పండుగకి వారంరోజుల ముందుగానే విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయవిహారం చేస్తోంది. తొలిరోజున మిశ్రమ స్పందన వచ్చినా వసూళ్లు పుంజుకుంటూ వచ్చాయి. మూడవ వారంలోకి ఎంటరైన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లోనే 87 కోట్లవరకూ రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇంతవరకూ 130 కోట్ల గ్రాస్ ను సాధించింది. త్వరలోనే ఈ సినిమా ‘జనతా గ్యారేజ్’ వసూళ్లను క్రాస్ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

Jai lava kusa break previous records

‘జనతా గ్యారేజ్’ 134.8 కోట్లను రాబట్టింది. ఇక జీఎస్టీ బిల్లు అమల్లోకి వచ్చిన తరువాత 80 కోట్లు రాబట్టిన సినిమా ‘జై లవ కుశ’ మాత్రమేనని అంటున్నారు. ఒక రకంగా ఇది ‘జై లవ కుశ’ సాధించిన అరుదైన ఘనత అని చెబుతున్నారు. మొత్తానికి ట్రిపుల్ రోల్‌తో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్‌కు ఫిదా అవుతోన్న ఆడియెన్స్ ఇంకా థియేటర్ల దగ్గర క్యూ కడుతున్నారు.

- Advertisement -