స్పీడ్‌ పెంచిన జై లవకుశ‌…

480
Jai Lava Kusa Audio Release Date
- Advertisement -

జూనియ‌ర్ ఎన్టీఆర్, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం జై ల‌వ కుశ‌. ఇందులో ఎన్టీఆర్.. జై, ల‌వ‌, కుశ అనే మూడు విభిన్న పాత్ర‌ల‌లో కనిపించ‌నున్న విషయం తెలిసిందే .గత నెలలో ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. జై అనే పాత్ర‌కి సంబంధించిన ఈ టీజ‌ర్‌లో ఎన్టీఆర్‌ అదరగొట్టేశాడు. ఈ టీజర్‌క మంచి స్పందన రాబట్టుకుంది. మూడు టీజర్లలో భాగంగా రెండోది ఇంకో పది రోజుల్లోపే రాబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. దీంతో పాటు ఆడియో వేడుకకు కూడా సన్నాహాలు మొదలైపోవడం విశేషం.

Jai Lava Kusa Audio Release Date

సినిమా విడుదలకు నెల రోజుల కంటే ముందే ‘జై లవకుశ’ ఆడియో వేడుక చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సిని వర్గాల సమాచారం ప్రకారం ‘జై లవకుశ’ ఆడియో ఆగస్టు 12న లాంచ్‌ చేయబోతున్నారట. ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే పాటల కంపోజిషన్ కూడా పూర్తి చేశాడట. ఇక త్వరలోనే ఆడియో రికార్డింగ్ జరుగుతుందట. ముందు ఆడియో రిలీజ్ చేసి.. ఆ తర్వాత మిగతా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టాలని భావిస్తోందట చిత్ర బృందం.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూణేలో జరుగుతోంది. గతంలో ‘రామ్ లీలా’ షూటింగ్ జరుపుకున్న భవనంలోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఆడియో వేడుక సమయానికే టాకీ పార్ట్ పూర్తి కావచ్చని సమాచారం. తర్వాత బ్యాలెన్స్ పాటలు చిత్రీకరించనున్నారు. సెప్టెంబరు 21న ‘జై లవకుశ’ విడుదల చేయబోతున్నారు.

- Advertisement -