- Advertisement -
బ్లాక్‌బస్టర్ చిత్రం హనుమాన్‌కు సీక్వెల్‌గా రాబోతున్న జై హనుమాన్ చిత్రాన్ని ఫిబ్రవరి 22న చారిత్రక నగరం హంపిలో ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవం భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. మొదటి భాగం విజయంతో అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి సంబంధించిన కథా రచన, ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఈ సీక్వెల్‌లో శ్రీ హనుమంతుడి శక్తివంతమైన పాత్రను పోషించనున్నారని వచ్చిన వార్తలతో సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది.
జై హనుమాన్ చిత్రీకరణ ఏప్రిల్ 2026లో ప్రారంభం కానుంది. హనుమాన్ చిత్రం దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని సాధించడంతో, ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Also Read:సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
- Advertisement -

