చలికాలంలో బెల్లం తింటే ఎన్ని లాభాలో!

67
- Advertisement -

బెల్లం తీపి పదార్థమే అయినప్పటికి బెల్లం తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా బెల్లన్ని ఉపయోగిస్తుంటారు. బెల్లం తరచూ తినడం వల్ల శరీరానికి సరైన పోషకాలు మెండుగా లభిస్తాయని ఆహార నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఈ చలికాలంలో బెల్లం తింటే ఎంతో మేలట. సాధారణంగా చలికాలంలో జీవక్రియ మరియు రోగ నిరోధక శక్తి మందగిస్తుంది. అంతే కాకుండా జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ బెల్లం ద్వారా విముక్తి లభిస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి సమ్మేళనలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. .

అందువల్ల సీజనల్ గా ఏర్పడే ఆరోగ్య సమస్యలకు బెల్లం బెల్లం ద్వారా చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం ఐరన్ వంటి పోషకాలు శరీర రక్తకణాల ఉత్పత్తిని పెంచి వారి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంకా చలికాలంలో తరచూ వేధించే కీళ్ల నొప్పులను నివారించడానిక్ బెల్లం లోని కాల్షియం, యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్లు చాలా బాగా పని చేస్తాయట. ఇక బెల్లాన్ని పాలలో కలుపుకుని మరగబెట్టి చల్లార్చిన తరువాత సేవించడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇక సీజన్ తో సంబంధం లేకుండా చాలానే ఉపయోగాలు ఉన్నాయి. బెల్లాన్ని తరచూ తినడం వల్ల రక్తహీనత సమస్య కూడా దూరమౌతుంది. ఇంకా ఇందులో ఉండే ఫైబర్ వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయ పడుతుంది. ఇక బెల్లం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ చలికాలంలో బెల్లం తప్పక తినాలని ఆహార నిపుణులు చెబుతున్నారు.

Also Read:Ram Mandir:దేశమంతా దీపావళి

- Advertisement -