రీవెంజ్ పాలిటిక్స్ మంచిది కాదు: జగ్గారెడ్డి

1
- Advertisement -

రివేంజ్ పాలిటిక్స్ ఎవరు చేసిన మంచిది కాదన్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణ ప్రజల రక్తంలో కక్ష సాధింపు గుణం ఉండదు…కక్ష సాధింపు చర్యలకు నేను వ్యతిరేకం అన్నారు. కాంగ్రెస్ నాయకులు రివేంజ్ పాలిటిక్స్ చేసినా మంచిది కాదు….నేను రాజకీయ యుద్ధం చేస్తాను. రివేంజ్ పాలిటిక్స్ చేయను అన్నారు.

చంద్రబాబు, వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి రివేంజ్ పాలిటిక్స్ చేయలేదు…రివేంజ్ పాలిటిక్స్ చేసిన రాజకీయనాయకులు ఏదో ఒకరోజు బాధపడక తప్పదు అన్నారు.

సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నే ఫస్ట్ ప్రోటోకాల్..నా భార్య కార్పోరేషన్ ఛైర్మన్.. ఆమె ప్రోటోకాల్ లో సెకండ్ ఉండాల్సిందేనన్నారు. 60 శాతం, 40 శాతంగా అధికార,ప్రతిపక్ష పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచిస్తా..నాతో సహా ఏ రాజకీయ నాయకుడైనా డబ్బు తీసుకోకుండా రాజకీయం చేస్తున్నామని చెప్పగలడా? అన్నారు.

Also Read:రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే: హరీశ్‌

- Advertisement -