జీవన్ రెడ్డికి మద్దతుగా జగ్గారెడ్డి

4
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. జీవన్‌ రెడ్డి ఆవేదన చూసి బాధనిపించిందని…జగిత్యాలలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు, జీవన్‌రెడ్డికి అండగా నేను ఉంటా అని చెప్పారు.

జీవన్‌రెడ్డి కాంగ్రెస్ వాది, ఆయన జీవితమంతా కష్టాలే.. .జీవన్‌రెడ్డి ఎప్పుడూ జనాల్లో ఉంటారు అన్నారు. ఈ వయసులో జీవన్‌రెడ్డి ఆవేదన చూసి మనసు కలుక్కుమంది.. జీవన్‌రెడ్డి ఒంటరి అనుకోవద్దు అన్నారు.

మీ వెంట నేనుంటా., నిత్యం జనం మధ్య ఉండే జీవన్‌ రెడ్డిని జగిత్యాలలో.. నన్ను సంగారెడ్డిలో ప్రజలు ఎందుకు ఓడగొట్టారో అర్థం కావడం లేదు అన్నారు.

Also Read:కనకరాజు మృతి పట్ల సీఎం రేవంత్, కేసీఆర్ సంతాపం

- Advertisement -