‘లెజెండ్’ సినిమాతో విలన్ గా మారి సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి వరుస ఆఫర్లతో జోరుమీదున్న నటుడు జగపతిబాబు. తాజాగా రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం’రంగస్థలం’. ఈ సినిమాలో విలన్ గా కనిపించి తన అద్భతమైన నటనతో విమర్శకుల ప్రసంశలు అందుకుంటున్నారు. తెలుగులో విలన్ గా మంచి పేరును మూటగట్టుకున్న జగపతిబాబు ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెడుతున్నట్లు సమాచారం.
కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా మంచి సినిమాలతో బాలీవుడ్‌లో బీజీగా మారాడు ప్రభుదేవా. ఆయన దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా సినిమా తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో దబాంగ్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిన విషయమే. దానికి సిక్వెల్‌గా దబాంగ్ మూడవ భాగాన్ని ప్రభుదేవా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో జగతిపతిబాబును ఓ పాత్ర కోసం ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమాలో అవకాశం వస్తే ఏ పాత్ర ఇస్తారనేదానిపై ఇంకా పూర్తి క్లారిటీ లేదు.