వెబ్‌సిరీస్‌ బాటపట్టిన జగపతిబాబు!

356
jagapathi babu
- Advertisement -

టాలీవుడ్‌లో హీరోగా,విలన్‌గా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న నటుడు జగపతిబాబు. లెజెండ్ సినిమాతో విలన్‌గా మారిన జగ్గూభాయ్‌ తర్వాత బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయారు.

అయితే కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సినిమాలు విడుదల తేదీలన్ని వాయిదాపడుతుండటం నేపథ్యంలో ఓటీటీపై ఆధారపడుతున్నారు నిర్మాతలు. దీంతో వెబ్ సిరీస్‌లకు డిమాండ్ బాగా పెరిగింది.

తాజాగా మరోసారి వెబ్ సిరీస్‌తో రానున్నారు జగపతిబాబు. రెండేళ్ల క్రితమే గ్యాంగ్‌స్టర్స్‌ చిత్రంతో డిజిటల్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిన జగపతిబాబు ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ వెబ్ సిరీస్‌లో నటించనున్నారట. ఆర్కా మీడియా వర్క్స్ పతాకం పై తెరకెక్కనున్న వెబ్ సిరీస్‌లో నటించనున్నారట త్వరలోనే దీనికి సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -