పటేల్ సర్….యు\ఎ

279
Jagapathi Babu Patel SIR Finished Censor Certification
- Advertisement -

ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేసిన జగపతిబాబు.. ‘లెజెండ్’ మూవీలో విలన్‌గా తనలో ఉన్న మరో యాంగిల్‌ను నిద్రలేపి.. ప్రతినాయకుడి పాత్రకు తొలి ఆప్షన్‌ జగ్గుభాయ్ అనే రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. విలన్‌గా ఆకట్టుకుంటున్న జగపతిబాబు ‘పటేల్ సార్’ చిత్రంతో మరోసారి లీడ్ రోల్ చేయబోతున్న విషయం తెలిసిందే. వారాహి బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈమూవీ జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవలె సెన్సార్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు\ఎ సర్టిఫికెట్‌ని పొందింది. సినిమాలో జగపతి ఫస్ట్ లుక్‌ నుంచి టీజర్ వరకు వచ్చిన రెస్పాన్స్‌తో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇటీవల విడుదలైన  టీజర్  యూట్యూబ్‌లో సన్సేషన్ క్రియేట్ చేసింది.

యాక్షనం థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ కిల్లర్ పాత్రలో జగ్గూ భాయ్ కనిపించబోతున్నాడు. వైట్ హెయిర్‌తో ఓ ఏజ్ డ్ పర్సన్‌గా  పూర్తిగా ఫిట్ బాడీతో మెస్మరైజ్ చేశాడు. కాల్ మీ సర్ ఓ చిన్నపిల్లతో అవ్వా బుజ్జి అవ్వా బుజ్జి ఆటే ఆడుదాం అంటూ టీజర్‌లో చెప్పే డైలాగులు అదిరిపోయాయి.  డైలాగ్స్‌, సినిమాటోగ్రఫీ, యాక్షన్‌ సీక్వెన్సెస్‌.. ఇలా ఒకటేమిటి, టీజర్‌లో అన్నీ హైలైట్సే. అన్నిటికీ మించి జగపతిబాబు సూపర్‌ హైలైట్‌. జగపతిబాబు మామూలోడు కాదు సుమీ.. అన్పించేలా వుందీ ‘పటేల్‌ సర్‌’ టీజర్‌.

- Advertisement -