Jagan:చంద్రబాబు ధ్యాస అంతా దోచుకోవడంపైనే

23
- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు ధ్యాస అంత దోచుకోవడంపైనే ఉందన్నారు ఏపీ సీఎం జగన్. టంగుటూరు ఎన్నికల సభలో మాట్లాడిన జగన్.. మహిళల సాధికారతను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదన్నారు. ఎవరి పాలనలో రిపోర్టు ఎలా ఉందో చూద్దామా అని ప్రశ్నించారు.

రైతుల విషయంలో బాబు రిపోర్ట్ ఏమిటో? జగన్ రిపోర్ట్ ఏమిటో? చంద్రబాబును ముక్కుసూటిగా అడుగుతున్నానని చెప్పారు. బాబు వస్తే జాబు వస్తుందని 2014 ఎన్నికల ముందు బాబు అన్నారని, కాని జాబులు వచ్చాయా అని నిలదీశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన ఉద్యోగాలు 32 వేలు అని చెప్పారు.

రైతు రుణమాఫీ చేశారా, బ్యాంకుల్లో ఉన్న బంగారు విడిపించారా అని జగన్ ప్రశ్నించారు. రైతులకు ఇన్ పుట్ సబ్సీడీ, వడ్డీ రాయితీలు, రైతు పెట్టుబడికి బరోసా డబ్బులు ఏనాడైనా ఇచ్చారా అని నిలదీశారు.14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబు అమలు చేసిన పథకాలు చెప్పుకోవడానికి ఏమీ లేవని అన్నారు. ఎన్నికల్లో వేసే ఓటు పేద జీవితాల తలరాతను మార్చుతాయని చెప్పారు.

Also Read:పాదాల పగుళ్ళకు చిట్కాలు..

- Advertisement -