మాస్ మహారాజా రవితే హీరోగా తెరకెక్కిన చిత్రం ధమాకా. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఏపీలో వైరల్‌గా మారింది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సమయానికి పడటం లేదు. ఇదే డైలాగ్‌ని ధమాకా సినిమాలో పెట్టి పొలిటికల్ టచ్ ఇచ్చారు దర్శకుడు.
జబర్దస్త్ కమెడీయన్ హైపర్ …..జగన్ మీద వేసిన ఈ సెటైర్ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో రావు రమేష్ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తూ హైపర్ ఆది. ప్రీ ఇంటర్వెల్ లో హీరోని చంపేయమని లోడెత్తావా రమణకు సుపారి ఇస్తారు రావు రమేష్. తర్వాత ఫోన్ కోసం ఎదురుచూస్తుంటాడు. ఈ క్రమంలో మాటి మాటి కి ఫోన్ చేసి వేసారా లేదా వేసారా లేదా అని అడుగుతూంటాడు. అప్పడు ఆది…బాబోయ్ అప్పటినుంచి వేసారా లేదా వేసారా లేదా? ఒకటో తారీకు వచ్చింది నా శాలరీ వేసారా లేదా? అంటాడు.
ఏపీలో గవర్నమెంట్ ఉద్యోగుల శాలరీలు ఫస్ట్ తారీఖుకు పడటం లేదని కొంతకాలంగా వినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆది చెప్పిన ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..