నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.. శారద పీఠం చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం మధ్యాహ్నం 12.30 వరకూ అక్కడే ఉండి, కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరిగి మధ్యాహ్నం 2.10కి తిరిగి తాడేపల్లికి వచ్చేస్తారు.
ఇక దాదాపు రెండు గంటల పాటు వార్షిక మహోత్సవ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలతో కలిసి శారదా పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారికి పూజల చేశారు. ఆగమ యాగశాలలో ఐదు రోజులుగా జరుగుతున్న శ్రీనివాస చతుర్వేద హవనం, విశ్వశాంతి హోమాలను సీఎం సందర్శించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా స్వరూపానందేంద్ర స్వామి వ్యాఖ్యానాలతో ఉన్న గ్రంథాన్ని ఇవాళ శారదాపీఠం సీఎం జగన్‌కి ఇవ్వబోతోంది. అలాగే సీఎం జగన్ కూడా శ్రోత మహాసభలో ఉత్తమ పండితుడికి స్వర్ణ కంకణధారణ చేస్తారు. కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2.10కి తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.