జగన్ కూడా కేసీఆర్‌లా చేస్తే… బాబు పరిస్థితి ఏంటి.??

362
jagan chandrababu
- Advertisement -

చంద్రబాబు కలలో కూడా ఉహించనిది జరగింది. టీడీపీ చరిత్రలోనే ఘోర ఓటమి,పార్టీ అడ్రస్‌ లేకుండా పోవడంతో అగమ్య గోచరంగా తయారైంది చంద్రబాబు పరిస్థితి.టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎన్నడూ ఎదురుకానంత ఘోర పరాభవాన్ని చవి చూసింది. దీంతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న బాబు పరిస్థితి తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందనేలా తయారైంది.

ఈ నేపథ్యంలో పట్టుమని 25 మంది ఎమ్మెల్యేలు కూడా లేని చంద్రబాబు ఏం చెయ్యబోతున్నాడు . కేసీఆర్ తరహా వ్యూహన్ని జగన్‌ అవలంబిస్తే చంద్రబాబు పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలత చంద్రబాబును ఆలోచింపజేస్తున్న ప్రశ్న .

వైసీపీ గెలిచిన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన జగన్‌ తాను ఏం చేయదలుచుకుంటున్నానో సూటిగా చెప్పేశారు. నవరత్నాలకు ప్రాధాన్యత ఇవ్వడమే కాదు ఆరు నెలల్లో సీఎం అంటే ఇలా ఉండాలి అనిపించుకుంటానని వెల్లడించారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితులోనూ వమ్ము చేయనని కుండబద్దలు కొట్టేశాడు.

దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ బాటలోనే జగన్ నడవనున్నాడా అన్న సందేహం చంద్రబాబులో నెలకొన్నట్లు తెలుస్తోంది. సంక్షేమం,అభివృద్ధిని జోడెడ్లలాగా తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా పరుగులు పెట్టిస్తున్నారు కేసీఆర్. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా ప్రభుత్వ పథకాలతో ఆకట్టుకున్నారు. ప్రజల విశ్వాసం పొందారు.ఫలితంగా రెండోసారి కేసీఆర్‌కే ప్రజలు తిరుగులేని మెజార్టీని కట్టబెట్టారు.

జగన్‌ కూడా సేమ్‌ టూ సేమ్‌ కేసీఆర్‌ని ఫాలో అయ్యేలా కనిపిస్తోందని టీడీపీ నేతలతో పాటు వైసీపీ నేతలు భావిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను మరిపించేలా జగన్‌ ప్రజల్లో విశ్వాసం చురగొంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా నవరత్నాలు అమలుతో పాటు ఏపీని అభివృద్ధిలో పరుగులు పెట్టించేలా జగన్ వ్యూహరచన చేస్తున్నారట. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించారట. సీనియర్ నేతలను కేబినెట్‌లో తీసుకోవడంతో అనుభవం కలిగిన అధికారులను సలహాదారులుగా నియమించడం ద్వారా పరిపాలనతో తనమార్క్ చూపించాలని జగన్ భావిస్తున్నారు.

జగన్ పాలన ప్రజారంజకంగా సాగితే టీడీపీ ఉనికి ప్రశ్నార్థకమే. దీంతో టీడీపీని ఎలా బ్రతికించుకోవాలి అన్న దానిపై చంద్రబాబు మళ్లగుల్లాలు పడుతున్నారట. మొత్తంగా దేశరాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన బాబుకు ఏపీ ఫలితాలు మింగుడుపడటం లేదు.

- Advertisement -