ఏపీలో వాలెంటరీ వ్యవస్థపై జరుగుతున్నా రగడ అంతా ఇంతా కాదు. ఈ మద్య పవన్ వాలెంటర్ల పై చేస్తున్న విమర్శలు తీవ్ర దుమరాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా వాలెంటర్లు డేటా చోరీకి పాల్పడుతున్నారని పవన్ చేస్తున్న విమర్శలు వైసీపీని కుదేలు చేస్తున్నాయి. పవన్ కు అడ్డుకట్ట వేసేందుకు గట్టిగానే విమర్శలు చేస్తున్నప్పటికి పెద్దగా ప్రభావం చూపడం లేదు. దీంతో స్వయంగా జగనే రంగంలోకి దిగి పవన్ పై విమర్శలు ఎక్కుబెట్టారు. పవన్ చంద్రబాబు యొక్క వాలెంటర్ అని దత్తపుత్రుడని తనదైన రీతిలో విమర్శించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి ఆ తరువాత పవన్ పై వ్యక్తిగతంగా చేసిన విమర్శలే కొంత చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పటివరకు తరచూ మూడు పెల్లుళ్ళు అంటూ పవన్ పై విమర్శలు గుప్పించే జగన్ ఈసారి ఆ విమర్శల గఃటు మరింత పెంచి.. నాలుగు పెల్లుళ్ళు అంటూ కొత్త పాట పాడారు.
అమ్మాయిలను లోబరచుకొని, నాలుగేళ్ళు కాపురం చేసివదిలేయడం, తరువాత మళ్ళీ మళ్ళీ పెళ్లిళ్లు చేసుకోవడం, ఒకటితో వివాహం చేసుకొని మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం పవన్ క్యారెక్టర్ అంటూ సంచలన విమర్శలు చేశారు జగన్. అయితే జగన్ చేసిన విమర్శలన్నీ తిరిగి ఆయనకే బెడిసి కొడుతున్నాయి. సిఎం స్థాయిలో ఉన్న వ్యక్తి.. ఇంత దిగజారి విమర్శలు చేయడం ఎంటనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పవన్ చేసిన విమర్శలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉంటే జగన్ చేసిన విమర్శలు వ్యక్తిగతంగా ఉన్నాయనేది కొందరి మాట. మరి పవన్ ను రాజకీయంగా విమర్శించడానికి జగన్ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవా ? పవన్ ను ఎప్పుడు టార్గెట్ చేసిన పెళ్లిళ్ల వ్యవహారం తప్పా మరోటి లేదా ? అనే ప్రశ్నలకు వైసీపీ నేతలు గాని అధినేత జగన్ గాని సమాధానం చెప్పలేని పరిస్థితి. దీంతో జనసేనాని పై చేసే విమర్శలన్నీ వైసీపీ నేతలకు బెడిసి కొడుతున్నాయి.
Also Read:పిక్ టాక్ :మత్తెక్కించే ఫోజులతో మైమరిపించింది