ఏపీ ప్రభుత్వం సంచలనం..మూడు రాజధానులు వెనక్కి

106
jagan
- Advertisement -

సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ సర్కార్ సంచనల నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని హైకోర్టుకు వెల్లడించారు అడ్వకేట్ జనరల్. మూడు రాజధానులపై అసెంబ్లీలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. దీనిపై అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ అధికారికంగా ప్రకటిస్తారని ఏజీ కోర్టుకు తెలిపారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్‌‌కు మూడు రాజధానులను ప్రకటించిన విషయం విదితమే. దీనికి సంబంధించిన బిల్లులు కూడా చట్ట సభల్లో, కోర్టుల దాకా కూడా వెళ్లాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇందుకు సంబంధించిన చట్టాలను ఉపసంహకరించుకున్నట్లు ఇవాళ జగన్ సర్కార్ సంచలన ప్రకటన చేసింది.

- Advertisement -