Jagan:డైవర్షన్ పాలిటిక్స్ ఇంకెన్నాళ్లు?

6
- Advertisement -

టీడీపీ అక్రమాలు, అన్యాయాలు బయటపెడుతున్నామని మళ్లీ డైవర్షన్స్‌ మొదలుపెట్టారని చెప్పుకొచ్చారు వైఎస్ జగన్. ఈసారి అమ్మ, చెల్లెలు ఫొటో పెట్టి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా?. ఈనాడు, ఏబీఎన్‌, టీవీ-5, దత్తపుత్రుడు ఇప్పటికైనా మారాలి. మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా.. మీ కుటుంబాల్లో ఇలాంటి గొడవలు లేవా?. ఇలాంటివి ప్రతీ ఇంట్లోనూ ఉండే విషయాలే. నిజాలు లేకున్నా వక్రీకరించడం ఇప్పటికైనా మానుకోండి. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు జగన్.

గన్‌ గుర్లకు వస్తున్నాడని తెలిసి మళ్లీ రాజకీయం చేస్తున్నారు. మా కుటుంబ విషయాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు అని విమర్శించారు.సెప్టెంబర్‌ 20వ తేదీన తొలి డయేరియా మృతి కేసు నమోదైతే 35 రోజులైనా ప్రభుత్వం స్పందించలేదు అన్నారు.

విజయనగరంలో డయేరియాతో చనిపోయిన కుటుంబానికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీనే ఇంత సాయం చేస్తుంటే.. బాధితులను పరామర్శిస్తుంటే.. ప్రభుత్వం నిద్ర మత్తులో ఉందా? అని మండిపడ్డారు. ప్రభుత్వం అలసత్వం కారణంగా గుర్లలో డయేరియాతో 14 మంది చనిపోయారు. ఇంత మంది చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదు అని దుయ్యబట్టారు.

Also Read;40 ఏళ్లుగా కాంగ్రెస్ కోసం పనిచేశా..ఫిరాయింపులు సరికాదు!

- Advertisement -