Jagan:హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా!

21
- Advertisement -

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించిందని కామెంట్స్ చేశారు. గత వారం వైసీపీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి రాగా ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఎన్నికలకు ముందు అనేక సర్వేలు చేయించామని.. వాటిలో ఎక్కడా కూడా వ్యతిరేకత రాలేదు. అందుకే చాలా కాన్ఫిడెంట్‌గా ఎన్నికలకు వెళ్లాం అని చెప్పారు జగన్. నేను బయటకొచ్చినట్లే మీరూ ఎన్నికల ఫలితాల నుంచి బయటకు రండి అని వైసీపీ అభ్యర్థులకు జగన్ సూచించారు.

2019తో పోలిస్తే 10 శాతం ఓట్లు తగ్గాయని…. ఆ పది శాతం జనాలు కూడా చంద్రబాబు మోసాలను, ప్రలోభాలను ఇట్టే గుర్తిస్తారని అన్నారు. ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచి ఏంటో తెలుసుని.. విశ్వసనీయతకు మనమే చిరునామా అని అన్నారు.

Also Read:అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు

- Advertisement -