పవన్‌పై జగన్ సంచలన కామెంట్

14
- Advertisement -

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత జగన్ సంచలన కామెంట్ చేశారు. పవన్‌ జీవితంలో ఒకేసారి ఎమ్మెల్యే అయ్యాడని, ఆయన తీరును చూస్తుంటే కార్పొరేటర్‌ కు ఎక్కువ.. ఎమ్మెల్యే కు తక్కువ అంటూ వ్యాఖ్యనించారు.

వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగన్‌… ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చాం. టీడీపీ సభ్యులు ఐదుగురు పక్కన కూర్చుంటాం అన్నారని, 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలను లాగేద్దాం అన్నారని, అయితే తాను వ్యతిరేకించి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చానని స్పష్టం చేశారు.

ఇంతమంది సభ్యులుంటేనే ప్రతిపక్ష హోదా అనేది ఎక్కడా లేదని పేర్కొన్నారు. ఎక్కడైనా ప్రభుత్వంలో అధికార పక్షం, ప్రతిపక్షం అనేవి రెండూ ఉంటాయని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడూ అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ మీరే చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు.

Also Read:హస్తినకు ఏపీ సీఎం చంద్రబాబు..

- Advertisement -