జగన్ సర్కార్ కు గట్టి దెబ్బ!

60
- Advertisement -

ఏపీలో ఇటీవల హాట్ టాపిక్ గా మారిన జీవో నెంబర్ వన్ పై రగడ కొనసాగుతూనే ఉంది. ఇటీవల చంద్రబాబు పర్యటనలో భాగంగా ఏపీలో విషాద ఘటనలు చోటు చేసుకున్నా సంగతి తెలిసిందే. దాంతో రోడ్ల పై బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఏపీ ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన జీవో నెంబర్ వన్ ప్రవేశ పెట్టింది. అయితే ఈ జీవో పై విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై హైకోర్ట్ లో దాఖలు అయిన పిటీషన్ పై తాజాగా దర్మాసనం స్పందిస్తూ జగన్ సర్కార్ కు షాక్ ఇచ్చింది. జీవో నెంబర్ వన్ పోలీస్ చట్టం సెక్షన్ 30 కి విరుద్దంగా ఉందని, అందువల్ల ఈ జీవో ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. దీంతో జగన్ సర్కార్ కు మరోసారి హైకోర్టు ద్వారా గట్టి షాకే తగిలిందని చెప్పాలి. అయితే హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది .

అయితే ఈ జీవో ను ఈ నెల 23 వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో సుప్రీం కోర్ట్ దీనిపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అంతే కాకుండా హైకోర్టు సిజే విచారణ జరపాలని కూడా చెప్పుకొచ్చింది అత్యున్నత న్యాయస్థానం. మొత్తానికి ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జీవో నెంబర్ వన్ జగన్ సర్కార్ కు పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఓ వైపు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు.. మరోవైపు కోర్టు నుంచి నిరాకరణ ఇలా అన్నీ వైపులా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో ఈ జీవో విషయంలో సి‌ఎం జగన్మోహన్ రెడ్డి ఎలా ముందుకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే కేవలం జనసేన, టీడీపీ టార్గెట్ గానే ఈ జీవో తీసుకొచ్చారనే విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. మరీ జీవో పై ధర్మాసనం నుంచి తుది తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

ఎకో టూరిజానికి ప్రోత్సాహం.

అర్థంలేని ఆరోపణలు :గుత్తా

కొత్త పార్లమెంట్‌ భవనం అందాలు…

- Advertisement -