రెడ్ బుక్‌ రాజ్యాంగతం తప్ప పాలనేది?

5
- Advertisement -

రాష్ట్రంలో ఇటీవల పరిణామాలు చూస్తే, అసలు రాష్ట్రంలో పాలన అనేది జరుగుతుందా అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది అన్నారు మాజీ సీఎం జగన్. ప్రజలు గొంతు విప్పే పరిస్థితి లేదు అన్నారు. గొంతు విప్పితే రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అంటూ ఆ గొంతును నులిమేస్తున్నారు అన్నారు.

ప్రజలకు సంక్షేమం లేదు, అభివృద్ధిలేదు…. ఎకానమీ పరిస్థితి చూస్తే తిరోగమనంలో ఉంది అన్నారు. కనీస ధర్మంగా ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన విద్య, వైద్యం ప్రైవేటు వ్యక్తుల చేతిలో దోపిడీకి గురవుతూ ఉంది… రాష్ట్రంలో పాలన ప్రజలకోసం సాగుతుందా? లేకపోతే దోపిడీదారులకోసం సాగుతుందా? అనేది ఒక క్వశ్చన్‌ మార్క్‌ అన్నారు జగన్.

రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పూర్తయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని కడుపుమంటతో చంద్రబాబు వాటిని ప్రైవేటుకు అమ్మేస్తున్నారు. అవన్నీ పూర్తయితే పేదలకు ఎంత గొప్ప సేవ అందుతుంది.. వాటి విలువ ఎన్ని వేల కోట్లకు చేరుతుంది అన్నారు. ఇవేమీ ఆలోచించకుండా సింపుల్ గా వాటిని అమ్మేస్తూ చంద్రబాబు డబ్బు చేసుకుంటున్నారు… మా ప్రభుత్వ హయాంలో మొదలైన మెడికల్ కాలేజీ లను చంద్రబాబు ఎందుకు పూర్తి చేయడం లేదు.. అవన్నీ పూర్తయితే రాష్ట్రానికి, రాష్ట్ర విద్యార్థులకు ఎంత ప్రయోజనం కలిగేది.. ఇవన్నీ ఆలోచించలేని చంద్రబాబు వాటిని ప్రైవేటుకు అప్పగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.. మంచి ప్రభుత్వం అంటే ఇదేనా చెప్పాలన్నారు.

ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తమకు అదనపు మెడికల్ సీట్లు కావాలని కేంద్రంతో పోరాడతారు కానీ చంద్రబాబు మాత్రం పులివెందుల మెడికల్ కాలేజీకి మంజూరైన మెడికల్ సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖ రాశారు. ఇంత దిక్కుమాలిన పాలకుడు దేశంలో ఇంకెవరైనా ఉన్నారా చెప్పాలన్నారు జగన్.

Also Read:నేపాల్‌..భారతీయుల కోసం హెల్ప్‌లైన్

- Advertisement -