హెచ్‌సీఏ ఎన్నికల బరిలో జ‌గ‌న్‌ మోహ‌న్‌రావు

60
- Advertisement -

హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడిగా పోటీ చేసేందుకు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్ రావు, అత‌డి ప్యానెల్ స‌భ్యులు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. శుక్ర‌వారం ఉద‌యం ఉప్ప‌ల్ స్టేడియంలో నామినేష‌న్లు స‌మ‌ర్పించిన అనంత‌రం జ‌గ‌న్‌మోహ‌న్‌ రావు త‌మ ప్యానెల్ పేరును ప్ర‌క‌టించారు. యూనైటెడ్ మెంబ‌ర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ నుంచి అధ్య‌క్షుడిగా జ‌గ‌న్‌మోహ‌న్ రావు, ఉపాధ్య‌క్షుడిగా పి.శ్రీధ‌ర్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఆర్‌. హ‌రినారాయ‌ణ, స‌హాయ కార్య‌ద‌ర్శిగా నోయ‌ల్ డేవిడ్ (మాజీ క్రికెట‌ర్‌), కోశాధికారిగా సి.జె శ్రీనివాస్‌, కౌన్సిల‌ర్‌గా అన్స‌ర్ అహ్మ‌ద్ ఖాన్ పోటీ చేస్తున్నారు.

జాతీయ హ్యాండ్‌బాల్ సంఘంలోని గ్రూపు రాజ‌కీయాలకు, అక్ర‌మాలు, అవినీతికి స్వ‌స్తి చెప్పి త‌న నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో ఆ క్రీడా అభివృద్ధికి కృషి చేసిన జ‌గ‌న్‌మోహ‌న్ రావు, ఇప్పుడు క్రికెట్ పురోగ‌తి కోసం హెచ్‌సీఏ ఎన్నిక‌ల సంగ్రామంలో బ‌రిలోకి దిగారు. వివాదాలు, కోర్టు కేసుల‌తో హెచ్‌సీఏ ప‌రువు మ‌స‌క‌బారుతుండ‌డంతో, అసోసియేష‌న్‌ను గాడిన పెట్టేందుకు దేశ క్రీడ రంగంలో ఇప్ప‌టికే త‌న‌కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న జ‌గ‌న్‌మోహ‌న్ రావును బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత‌లే బ‌రిలోకి దించిన‌ట్టు తెలుస్తోంది.

Also Read:దేవర ఈ సోదేంది బాసూ?

- Advertisement -