- Advertisement -
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున జనాలు ముందుకువస్తున్నారు. పలుచోట్ల వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవలు చోటు చేసుకున్న ఓటర్లు మాత్రం ఓటు వేసేందుకు ముందుకువస్తున్నారు.
గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పోలింగ్ స్టేషన్లోకి క్యూలో వెళ్లకుండా నేరుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న ఓటరు.. ఎమ్మెల్యే శివకుమార్‌ను నిలదీశారు. ఆగ్రహాంతో ఊగిపోయిన ఎమ్మెల్యే.. ఓటరుపై చేయి చేసుకున్నాడు. బాధిత ఓటరు కూడా ఎమ్మెల్యేను కొట్టాడు. ఎమ్మెల్యే అనుచరులు ఓటరుపై దాడి చేసి గాయపర్చగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read:బాదం, పల్లీలతో లాభాలెన్నో!
- Advertisement -