వంశీతో వైఎస్ జగన్ భేటీ

1
- Advertisement -

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో భేటీ అయ్యారు మాజీ సీఎం జగన్‌. భేటీ అనంతరం మాట్లాడిన జగన్.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంశీని టార్గెట్ చేశారు అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని…. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చాడు.

వంశీని కావాలనే తప్పుడు కేసుల్లో ఇరికించారని …. చంద్రబాబు కావాలనే పట్టాభిని గన్నవరం పంపించి ప్రెస్ మీట్ పెట్టించారు అన్నారు. వల్లభనేని వంశీ నెలల తరబడి బెయిల్ రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

Also Read:మీలాగే అంతా బ్లాక్‌మెయిల్ దందా చేస్తారా?

పోలీసులు టీడీపీ నేతలకు కాకుండా మీ టోపికి కనిపించే సింహాలకు సెల్యూట్ కొట్టండి. అన్యాయం చేసిన వారిని బట్టలూడదీసి నిలబెడతాం అన్నారు. సప్త సముద్రాలు దాటినా ఎక్కడున్నా.. అన్యాయానికి శిక్ష పడేలా చేస్తామని జగన్ హెచ్చరించారు. పట్టాభి ఇష్టానుసారంగా మాట్లాడటంతో వైసీపీ కార్యకర్తలు గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి చేశారు. కానీ ఆ దాడిలో వల్లభనేని వంశీ లేరని చెప్పారు.

- Advertisement -